Learning Resources

Listen to and learn the lessons taught by teachers in traditional methods for the study of Sanskrit and Telugu languages ​​and literature.

16

Total Courses

300+

Total Hours

9

Expert Instructors

సంస్కృత వ్యాకరణము

మాటకు ప్రాణం వ్యాకరణం. నియంత్రణ లేని యంత్రము ఎంత నిరూపయోగమో, ఎంత ప్రమాదకరమో వ్యాకరణం రాని వాగ్వ్యాపారమూ అంతే. భాష లోకాన్ని అనుసరించేదే అయినా, సంస్కారాన్ని పెంపొందించడానికి నియామాలు అవసరము. శబ్దము అర్థము కావాలి అన్నా, భావము మదిలో మెదలాలి అన్నా వ్యాకరణజ్ఞానం తప్పక ఉండాలి. ప్రపంచములోనే అతిప్రాచీనమైనది, అతి పటిష్టమైనది సంస్కృతవ్యాకరణం. తెలుగు వ్యాకరణానికి కూడా అదే మూలం. సాక్షాత్తు ఈశ్వరుని డమరుకనాదమును నుండి పుట్టిన అక్షర సముదాయము పాణిని మహర్షి పటిష్టమైన సూత్ర నిర్మాణమున…

Mahamahopadhyaya Pracharya Salaka Raghunatha Sarma Garu

June 2, 2026 5:00 pm

ఎఱ్ఱన నృసింహ పురాణము

ఇది పురాణము. ప్రబంధము. ఇది అహోబల క్షేత్రమాహాత్మ్యకావ్యము. దుష్ట శిక్షణ – శిష్ట రక్షణకై అవతరించిన శ్రీ నృసింహావతార వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ‘ప్రబంధ పరమేశ్వరుడు’, ‘శంభుదాసుడు’ గా పేరుగాంచిన, కవిత్రయంలో ఒకరైన, చెదలవాడ ఎఱ్ఱాప్రగడ గారిచే రచింపబడినది. సూక్తి వైచిత్రి, వర్ణనాత్మకశైలి, ఆలంకారిక శోభలతో, ఎందరో కవుల రచనలకు మార్గదర్శకంగా నిలిచింది. నృసింహపురాణం ప్రబంధాలకు, పురాణాలకు, క్షేత్రమాహాత్మ్యకావ్యాలకు, కరదీపికగా వెలుగొందింది. ఉపపురాణంగా ప్రఖ్యాతిని పొందింది.

Acharya Kolavennu Malayavasini Garu

June 2, 2026 5:04 pm

వాల్మీకి రామాయణము

రామో విగ్రహవాన్ ధర్మః. భారతీయ సనాతనధర్మానికి మూలమైన గాథ రామాయణము. అది సీతాయాశ్చరితంమహత్. లౌకిక వాఙ్మయములో మొట్టమొదటి కావ్యము, వాల్మీకి మహర్షి అందించిన శ్రీమద్రామాయణము. ఆ కావ్యాన్ని నేర్చుకోవడం, అందులోని పరమార్థాన్ని జీవితములో కూర్చుకోవడం ప్రతి భారతీయుని ప్రథమ కర్తవ్యము.

Acharya Mullapudi Jaya Seetarama Sastry Garu

June 2, 2026 5:15 pm