మన పలుకు... మన గెలుపు!
నేర్చుకుందాం... నిర్మించుకుందాం!

జ్ఞాన వృక్షం

ఎందుకు మన భాష? ఎందుకు మన సాహిత్యం?

Video Thumbnail

ప్రతి సంస్కృతికీ తనదైన ఒక ఆత్మ ఉంటుంది. అది భాషలో ధ్వనిస్తుంది. సాహిత్యంలో వసిస్తుంది. మన ఆత్మను అందుకునేందుకు, మనలో నిలుపుకునేందుకే ఈ మన ప్రయత్నం. ఇది వాక్ఛుద్ధి, ధీవృద్ధి, రససిద్ధి.. సాధించే మార్గం. ఆత్మను కోల్పోయిన సమాజం మనుగడ సాగించలేదు. తెగినగాలిపటము తీరేమి దారేమి? వ్రేళ్ళు తెగిన చెట్టు పెరుగుటేమి? ఆత్మలేని దేహ మది యుండి ఫలమేమి? తెలుగుదనము... లోని వెలుగుదనము!

మరింత తెలుసుకోండి

మన గురువులు

వరిష్ఠులైన గురువులు మన బలము

అధ్యయనంలో, అధ్యాపనలో ఎన్నో ఏళ్ల విశేష అనుభవముతో, సంస్కృతాంధ్ర భాషాసాహిత్యములపై సాధికారత సంపాదించి, విలువలతో కూడిన విద్యను అందిస్తున్నవారు

Teacher

ఆచార్య శలాక రఘునాథ శర్మ గారు

Teacher

ఆచార్య కోలవెన్ను మలయవాసిని గారు

Teacher

ఆచార్య దోర్బల ప్రభాకర శర్మ గారు

Teacher

డా. ముళ్ళపూడి జయ సీతారామ శాస్త్రి గారు

Teacher

శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు

Teacher

డా. ధూళిపాల రామకృష్ణ గారు

Teacher

డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు

Teacher

డా. ధూళిపాల మహాదేవమణి గారు

Teacher

శ్రీ కోట వేంకట లక్ష్మీ నరసింహం గారు

Teacher

డా. కందుకూరి రామకృష్ణ సూర్యనారాయణ గారు

Teacher

డా. కడిమిళ్ళ వరప్రసాద్ గారు

మన పోషకులు

IKS Logo

భారతీయ జ్ఞానపరంపరా విభాగము, విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు भारतीयज्ञानसंवाहिनी కార్యక్రమం ద్వారా మనకు చేయూతనందిస్తున్నారు. వారి भारतीयज्ञान-शिक्षक-प्रशिक्षण-केन्द्रम् యోజనలో మన భాషా అధ్యయన పరిషత్ ట్రస్ట్ "సంస్కృతాంధ్రవాఙ్మయాధ్యాపనగురుకులమ్" గా గుర్తింపు పొందింది.

అధ్యయన భాండాగారము

సంస్కృతాంధ్ర భాషాసాహిత్యముల అధ్యయనము కొరకు సంప్రదాయ పద్ధతులలో గురువులు బోధించిన పాఠములను వినండి. నేర్చుకోండి.

13

పాఠ్యాంశాలు

300+

గంటలు

11

గురువులు

మన మార్గము

आचार्यात् पादमादत्ते पादं शिष्यः स्वमेधया । पादं सब्रह्मचारिभ्यः पादं कालक्रमेण च ॥

Learn from Guru

గురువుల నుండి నేర్చుకోవడం

Self Practice

స్వయంగా అభ్యాసం చేయడం

Learn with Peers

తోటి విద్యార్థుల నుండి నేర్చుకోవడం

మనం కలిసి నడుద్దాం

ఇది మనందరి బాధ్యత. ఇది మనందరి ఆనందం. మనది తెలుగు భాష. సంస్కృతముచే పరిపుష్టమైన భాష. మహోన్నత సాహిత్యసంపద మనకు ఉన్నది. కలిసి నేర్చుకుందాం. తెలుగుదనాన్ని నిలుపుకుందాం. తప్పక చేరండి. సంస్కృతంలోని సౌందర్యం, తెలుగులోని మాధుర్యం కలగలసిన సంస్కారాన్ని తనివితీరా ఆస్వాదిద్దాం.